మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నాయకులు
రేగొండ మండలం లింగాల గ్రామానికి చెందిన పోల్లూరు వీరయ్య మృతి పట్ల గండ్ర దంపతుల ఆదేశానుసారం బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మృతుడి కుమారులు పోల్లూరు రాజేశ్వర్ రావు, బాబు రావు లను వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ రేగొండ మండల అధ్యక్షులు అంకం రాజేందర్, రంగయ్యపల్లి సర్పంచ్ కాతమల్ల మోహన్ రావు, నాగుర్లపల్లి సర్పంచ్ బూర్గుల రాంబాబు, లింగాల సర్పంచ్ సురేష్, మాజీ సర్పంచ్‌లు మోటే రాజేశ్వర్ రావు, మామిడి శెట్టి విజయ మహేందర్, బీసీ సెల్ అధ్యక్షులు బండి రమేష్ పాల్గొన్నారు.అలాగే కొసరి లక్ష్మి నరసింహ స్వామి గ్రామ శాఖ అధ్యక్షులు తిప్పరపు శ్రీను, సామల లక్ష్మణ్, పిట్టల రమేష్‌తో పాటు లింగాల గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు తదితరులు హాజరయ్యారు.మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, బాధిత కుటుంబానికి పార్టీ తరఫున అండగా ఉంటామని నాయకులు భరోసా ఇచ్చారు