తల్లాడ మండల కేంద్రంలో మాజీ సర్పంచుల పదవీకాలం పూర్తయి రెండు సంవత్సరాలు అయినా ఇంతవరకు వాళ్లకు చెల్లించాల్సిన బిల్లులు చెల్లించకుండా రేపటినుండి జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో తమ సమస్యల పరిష్కరించాలని మాజీ సర్పంచుల సంఘం ఇచ్చిన పిలుపులకు హైదరాబాద్ వెళ్తారని ముందస్తు అరెస్టులు చేయటం దుర్మార్గమని సిపిఎం మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వరరావు అన్నారు న్యాయబద్ధంగా వాళ్లకు రావలసిన బిల్లులు బకాయిలను వెంటనే చెల్లించాలని లేనిచో మాజీ సర్పంచులు చేపట్టిన ఆందోళనకు తమ పార్టీ మద్దతు తెలియజేస్తుందని అన్నారు అనేకమంది సర్పంచులు అప్పుల పాలై ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు