గోరి కొత్తపల్లిలో సర్పంచ్ నిమ్మల శంకర్‌కు స్నేహ యూత్ ఘన సన్మానం
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి కొత్తపల్లి గోరి
గోరి కొత్తపల్లి గ్రామ సర్పంచ్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నిమ్మల శంకర్ ను స్నేహ యూత్ సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు.గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో స్నేహ యూత్ అధ్యక్షుడు ఆవుల రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్‌కు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ నిమ్మల శంకర్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. స్నేహ యూత్ సంఘం గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా అదే ఉత్సాహంతో గ్రామాభివృద్ధికి సహకరించాలని యూత్ సభ్యులను కోరారు.అనంతరం గ్రామ వార్డు సభ్యుడు తుమ్మరపెల్లి వేణు ను కూడా స్నేహ యూత్ సభ్యులు శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్నేహ యూత్ ఉపాధ్యక్షుడు లింగంపల్లి కృష్ణ, సీనియర్ సభ్యులు నామాల వినయ్ కుమార్,పకిడే హరీష్,రఘుసాల రాజేందర్,సుఖినే అనిల్,ఇంగ్లే విజయ్,బైకాని కార్తీక్ తో పాటు పలువురు యువకులు పాల్గొన్నారు.కార్యక్రమం ఉత్సాహభరితంగా, ఐక్యతను ప్రతిబింబించేలా సాగింది.