భూపాలపల్లి పట్టణం కేంద్రంలోనీ పలు కాలనీలలో ప్రజలు కోసం పలు అభివృద్ధి పనులు
: భూపాలపల్లి పట్టణం కేంద్రంలోనీ పలు కాలనీలలో ప్రజలు కోసం పలు అభివృద్ధి పనులు
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 5 ఇంక్లైన్ కమాన్ దగ్గర 7 కోట్ల రూపాయలతో కమ్యూనిటీ హాల్ మరియు అంబేద్కర్ భవనము నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.పెద్దకుంటపల్లిలో 2 కోట్ల రూపాయలతో అంతర్గత సీసీ రోడ్లు మరియు సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.జంగేడులో 50 లక్షల రూపాయలతో వైకుంఠ ధామం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.రాంనగర్ కాలనీలో 50 లక్షల రూపాయలతో బొగ్గు లోడింగ్ మరియు ఆన్ లోడింగ్ కార్మికుల యూనియన్ సంక్షేమ భవనం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూభూపాలపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను మెరుగుపరచడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.కమ్యూనిటీ హాల్, అంబేద్కర్ భవనం వంటి ప్రజా ఉపయోగకరమైన నిర్మాణాలు సామాజిక ఐక్యతకు దోహదపడతాయని, అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులతో కాలనీలలో పారిశుద్ధ్యం మెరుగుపడుతుందని తెలిపారు.వైకుంఠ ధామం నిర్మాణంతో అంత్యక్రియల సమయంలో కుటుంబాలకు సౌకర్యం కలుగుతుందని,కార్మికుల యూనియన్ సంక్షేమ భవనం ద్వారా కార్మికుల సమస్యలకు పరిష్కార వేదిక ఏర్పడుతుందని అన్నారు.అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.భూపాలపల్లి పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొంటూ, ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.