రాజేశ్వరి టీచర్ సేవలు అభినందనీయం
మండల విద్యాశాఖ అధికారి అనితా దేవి,సర్పంచ్ పెండ్లి శ్రీనివాస్ రెడ్డి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రాంపురం లో పనిచేస్తున్న ఎస్జీటీ ఉపాధ్యాయురాలు రాజేశ్వరి వారు పనిచేస్తున్న పాఠశాల పిల్లల కోసం చేస్తున్న సేవలు అభినందనీయమని మరిపెడ మండల విద్యాశాఖ అధికారి అనితాదేవి, రాంపురం సర్పంచ్ పెండ్లి శ్రీనివాస్ రెడ్డి అన్నారు,మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రాంపురం ప్రధానోపాధ్యాయులు హీరాలాల్ అధ్యకతన ఏర్పాటు చేసిన సమావేశంలో పిల్లలందరికీ టి షర్ట్స్ పంపిణీ చేసారు, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాజేశ్వరి తన సహచర మిత్రులను సంప్రదించి 20వేల రూపాయలు సమీకరించి పిల్లల మీద ఉన్న ప్రేమ అభిమానంతో టీ షర్ట్స్ కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు పిల్లలందరికీ టి షర్ట్స్ పంపిణీ చేశారు,ప్రైవేట్ పాఠశాల కు దీటుగా ఉండే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో అభినందనీయం, ఆదర్శనీయమని రాజేశ్వరి సేవలను కొనియాడారు,అంతేకాకుండా గతంలో ఈ పాఠశాల ఉపాధ్యాయులు ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు గా ఉన్న గుర్రం వెంకన్న గౌడ్ కూడా పాఠశాల అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు ఇలా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కలిసి పాఠశాలను బలోపేతం చేయడానికి, పాఠశాలలో మౌలిక వసతులను కల్పించడానికి పిల్లలకు అవసరాలను తీర్చడానికి కార్యక్రమాలు చేయడం మిగతా పాఠశాలకు ఆదర్శనీయమని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఉపాధ్యాయుల అందరిని కూడా అభినందించారు రాబోయే కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమలు పిల్లల అభివృద్ధి కోసం కొనసాగించాలని కోరారు,ఈ కార్యక్రమంలో హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శశిధర్ , పాఠశాల చైర్మన్ పసుపులేటి శోభ, ఉపాధ్యాయులు గుర్రం వెంకన్న గౌడ్,గణేష్,శ్రీధర్, రాజేశ్వరి,క్రాంతి, తల్లిదండ్రులు, పరుశరాములు తదితరులు పాల్గొన్నారు