అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్
పేదల పొట్ట కొట్టి గ్రామీణ పెట్టుబడిదారులు , భూస్వాముల జేబులు నింపడం కోసమే జి రామ్ జి చట్టం
బిజెపి మోడీ ప్రభుత్వం తెచ్చిన జి రామ్ జి చట్టం రద్దుచేసి పాత గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరణ చేసేదాకా దేశవ్యాప్తంగా ఆందోళన ప్రచారం నిర్వహిస్తామని, పేదల పొట్ట కొట్టి గ్రామీణ భూస్వాములు పెట్టుబడిదారుల జేబులు నింపడం కోసమే కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ అన్నారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భాగలింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద జి రామ్ జి చట్టం కాఫీలను దగ్ధం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు గ్రామీణ ఉపాధి హామీ చట్టం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో 90 శాతం నిధులతో నడిచేది ప్రస్తుతం 60 శాతం నిధులు మాత్రమే ఇస్తాం మిగతా 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలని నిర్ణయం చేశారు . ఆర్థికంగా దెబ్బ కొట్టి రాష్ట్ర ప్రభుత్వాలనే లొంగదీసుకోవాలని కుట్ర దీనిలో దాగి ఉన్నది 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఆటోమేటిగ్గా నిధులను ఆపు చేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే నిధుల కొరతతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు 40 శాతం నిధులు ఇస్తారని గ్యారెంటీ లేదు. ఫలితంగా ఈ పనిని గ్రామీణ ప్రాంతంలో ఎత్తివేయాలని కుట్ర జరుగుతున్నది. 125 రోజులు పని దినాలు పెంచినట్లే పెంచి 60 రోజుల పనిని వ్యవసాయ సీజన్ లో బందు పెట్టాలని నిర్ణయం చేశారు. ఈ నిర్ణయం పని హక్కును దెబ్బతీస్తున్నది. ఉపాధి హామీ మౌలిక చట్టాన్ని దెబ్బతీసే కొట్ర దేనిలో ఉన్నది. ఎలాంటి పనులు చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఇది ప్రజల భాగస్వామ్యాన్ని, గ్రామపంచాయతీ పాత్రను పూర్తిగా రద్దు చేశారు. ఇది రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు రాష్ట్ర నాయకులు బి ప్రసాద్ పొన్నం వెంకటేశ్వరరావు, నారి అయిలయ్య, కొండమడుగు నరసింహ , సాంబశివ , అన్నవరపు కనకయ్య బొప్పని పద్మ, ములకలపల్లి రాములు , రాళ్లబండి శశిధర్ , కందుకూరి జగన్ ఎం వెంకటయ్య, నరసింహులు, గోపాల్, పెద్ది వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు