చాగంటి రాములు మృతి సీపీఎంకు తీరని లోటు
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు
నివాళులర్పించిన సీపీఎం నేతలు రఘునాథపల్లి మండలంలోని కుర్చపల్లి గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ సభ్యులు కామ్రేడ్ చాగంటి రాములు మృతి పార్టీకి తీరని లోటు అని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు అన్నారు.అనారోగ్యంతో ఇటీవల మరణించిన రాములు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి సంతాపం తెలిపారు.రాములు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా చాగంటి రాములు భౌతికకాయంపై ఎర్రజెండా కప్పి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం రాపర్తి రాజు మాట్లాడుతూ..చాగంటి రాములు తన జీవితాంతం పార్టీ నీతి,నిజాయితీలకు కట్టుబడి గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక ఉద్యమాలు,పోరాటాలలో చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు.రోజుకో పార్టీ,పూటకో జెండా మారుతున్న ఈ రోజుల్లో ఎలాంటి ప్రలోభాలకు లోనుకాక తాను నమ్మిన సీపీఎం ఎర్రజెండాను చివరి వరకు పట్టుకున్న నిబద్ధ కార్యకర్తగా రాములు నిలిచారని ప్రశంసించారు.రాములు ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ శ్రేణులు అంకితభావంతో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి గంగాపురం మహేందర్,గ్రామ కార్యదర్శి కాసాని పుల్లయ్య,మండల కమిటీ సభ్యులు మంచాల మల్లేష్,గ్రామ నాయకులు కాసాని వెంకటయ్య,తోటకూరి భూపాల్,మంచాల తిరుమాల్,తోటకూరి యాకయ్య,చింతల కొమురయ్య,రావుల ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.