రాంపురం గ్రామపంచాయతీ పరిధి మొదటి వార్డు
తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని రాంపురం గ్రామపంచాయతీ పరిధి మొదటి వార్డులో స్థానిక సర్పంచ్ పెండ్లి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో శానిటేషన్ పనులు జి,పి సిబ్బంది ద్వారా సజావుగా సాగుతున్నాయి,పరిసరాల పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకొని, మంచినీళ్ల బావి నుండి గడి మైసమ్మ బజార్లో సైడ్ కాలువల ద్వారా మురికి నీరు అంతరాయం లేకుండా సాగేందుకు అడ్డంకులను తొలగింప చేశారు. ఆవాస, నివాస ప్రాంతాలలో పరిసరాల పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు.ఈ కార్యక్రమం లో జిపి సిబ్బంది వెంకటయ్య,వెంకన్న,బందు వీరన్న పాల్గొన్నారు.