జ్వరాలు లేని గ్రామంగా తీర్చిదిద్దే దానికి కృషి చేయాలని పిలుపు"
జ్వరాలు లేని గ్రామంగా తీర్చిదిద్దే దానికి కృషి చేయాలని పిలుపు”
సత్తుపల్లి,ఆర్ సి,జనవరి10(తెలుగు గళం)న్యూస్:ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలంలోని భరణిపాడు గ్రామంలో గల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ద్వితీయ శ్రేణి ఏఎన్ఎం జ్యోతి,ఆశా వర్కర్ లలిత కుమారి లు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ పర్సా ప్రసాద్ రావు పాల్గొని మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వ వైద్యాన్ని తీసుకెళ్లాలని,జ్వరాలు లేని గ్రామంగా తీర్చిదిద్దే దానికి కృషి చేయాలని,పారిశుధ్యం,వ్యక్తిగత శుభ్రతపై ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.మొత్తంగా ఈ శిబిరంలో గ్రామానికి చెందిన ప్రజలు 70 మంది వైద్య పరీక్షలు,బీపీ,షుగర్ తనిఖీలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో: వైస్ ప్రెసిడెంట్ సిoగపోగు లక్ష్మీ లక్ష్మీనారాయణ,గ్రామ పెద్దలు మాజీ సహకార సంఘం అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు (నాని),బొంతు మోహన్ రావు,బాలా రాంబాబు,మందపాటి సీతారెడ్డి,మేడా వెంకటేశ్వరరావు,కూరపాటి చెన్నారావు,మల్లెపూల ఆంజనేయులు,చుక్కా కృష్ణ,మందపాటి సత్యనారాయణరెడ్డి,అమెరికా రెడ్డి,దొడ్డా సత్యావతి,దొడ్డా మల్లారెడ్డి,నారోజు సత్యవతి, పర్స వెంకన్న,తిరుపతమ్మ, మునియ్యా,మందపాటి నిర్మల,మల్లెపూల జగన్నాథరావు,బాలా సూరిబాబు,గ్రామ పంచాయతీ కార్యదర్శి అజ్మీరా రాజు పాల్గొన్నారు