మదర్ థెరీసా విద్యాలయంలో సంక్రాంతి సంబురాలు
సత్తుపల్లి,ఆర్ సి,జనవరి10(తెలుగుగళం) న్యూస్: సత్తుపల్లి పట్టణంలోని మధర్ తెరిస్సా టెక్నో విద్యాలయంలో శనివారం ముందస్తుగా సంక్రాంతి సంబురాలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాల్గొన్నారు.మధర్ తెరిస్సా టెక్నో స్కూల్ లో సంక్రాతి సంబరాల్లో స్కూల్ విద్యార్థిని, విద్యార్థులతో కలిసి బోగి మంటలు వద్ద ఆట,పాటలు కార్యక్రమంలో చిన్నారులతో కలిసి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ కోలాటం ఆడారు.
హరిదాస్ వేష దారణలో అబ్బుర పరిచిన చిన్నారులను రాగమయి అభినందిoచారు.
ప్రజలు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని, సత్తుపల్లి నియోజకవర్గంలో విద్యార్థిని,విద్యార్థులు అందరు మంచిగా చదువు కోవాలని ఆమె కోరారు.సంక్రాతి సెలవుల్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తల్లి తండ్రులకు సూచనలు చేశారు.సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు, ప్రిన్సిపాల్స్ కు, ఉపాధ్యాయులుకు,స్టాఫ్ కు ప్రత్యేకంగా సంక్రాతి పండుగ శుభాకాంక్షలను ఎమ్మెల్యే తెలిపారు.పాఠశాల అధినేత నాయుడు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.