సర్పంచ్ ల సన్మాన కార్యక్రమం
ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు తల్లాడ మండలాలలో గ్రామాల కాంగ్రెస్ పార్టీ నూతన సర్పంచ్,ఉప సర్పంచ్ లకు, వార్డు మెంబర్స్ కు మంగళవారం సత్తుపల్లి పట్టణ శివారులో గల రాణి సెలబ్రేషన్ పంక్షన్ హాలులో తెలంగాణ రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి,ఖమ్మంజిల్లా ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి లు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో: సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్,రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ లు ప్రతి గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్,వార్డు సభ్యులకు కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. అధికారం కోల్పోయాక బి.ఆర్.ఎస్ నేతలు జీర్ణించుకోలేక చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి గులాబీ పార్టీ కు తగిన బుద్ధి చెబుతారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో: సత్తుపల్లి,వేంసూరు,పెనుబల్లి, కల్లూరు,తల్లాడ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, AMC చైర్మన్ లు, డైరెక్టర్ లు, సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్, nsui నాయకులు పాల్గొన్నారు.