రైతుల కార్మికుల ప్రజల హక్కులను కాపాడాలి
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి
•కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరి అయినది కాదు
•జనవరి 17,18,19 తేదీలలో జిల్లా వ్యాప్తంగా జరుగు జీపు జాతాను జనవరి19న జిల్లా కేంద్రం వరంగల్ బహిరంగ సభను జయప్రదం చేయండి
•సిఐటియు,రైతు, వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు.
పర్వతగిరి మండల కేంద్రంలో ప్రజా సంఘాల నాయకులు కరపత్రం ఆవిష్కరించారు తెలంగాణ రైతు సంఘం, సిఐటియు,తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, వరంగల్ జిల్లా అధ్యక్షులు నవీన్‌ల స్వామి మాట్లాడుతూ కేంద్రం లోని బిజేపి నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం గత 11సంవత్సరాల నుండీ ప్రజల పై భారాలు మోపుతూ దేశ సంపదను కార్పొరేట్ అధిపతులకు కారుచౌకగా అప్పచెపుతుందని అన్నారు.ఎన్నో పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి వినాశ కరమైన నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికుల శ్రమను కార్పొరేట్ యజమానులకు దారాదత్తం చేస్తున్నాడని,కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా 2005సంవత్సరంలో యూ. పి.ఏ. ప్రభుత్వం తీసుకువచ్చిన మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తుంగలో తొక్కి కూలీలకు పనులు చేసే అవకాశం లేకుండా మోడీ ప్రభుత్వం
వ్యవహరిస్తున్నదని,వినాశకరమైన విద్యుత్ సవరణ చట్టం తీసుకు వచ్చి ప్రజలపై విద్యుత్ భారాలు మోపుతుందని, మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఐక్యమై తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు పోడేటి దయాకర్ ,సిఐటియు మండల కార్యదర్శి జిల్లా రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం ,మండల నాయకులు మాదాస యాకూబ్, సిఐటియు మండల అధ్యక్షులు నకరకంటి రామచందర్ తదితరులు పాల్గొన్నారు.