ఘనంగా సంక్రాంతి క్రీడోత్సవాలు
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో డివైఎఫ్ఐ,ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ ఉల్లి వెంకటయ్య స్మారకార్థంగా జనవరి 13,14 తేదీల్లో నిర్వహించిన గ్రామ స్థాయి సంక్రాంతి క్రీడోత్సవాలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా నిర్వహించిన కబడ్డీ,వాలీబాల్,షటిల్,ముగ్గుల పోటీల్లో విజేతలైన క్రీడాకారులకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎస్సై వినయ్ కుమార్ మాట్లాడుతూ..“గ్రామీణ క్రీడలు యువతలో శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ,జట్టుగా పనిచేసే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయి.సంక్రాంతి వంటి పండుగల సందర్భంగా ఇలాంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరుచుకుంటారని అన్నారు.అమరజీవి కామ్రేడ్ ఉల్లి వెంకటయ్య స్మారకార్థంగా ఈ క్రీడోత్సవాలు నిర్వహించడం అభినందనీయం”అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు ఇర్రి అహల్య,సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్,గ్రామ సర్పంచ్ మందపురం రాణి అనిల్,ఉపసర్పంచ్ లింగనబోయిన రాజు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.అదేవిధంగా సిపిఎం పార్టీ,ప్రజాసంఘాల నాయకులు కుర్ర ఉప్పలయ్య,తొడెంగల ఐలయ్య,కత్తుల రాజు,మంద మహేందర్,గట్ల మల్లారెడ్డి,డివైఎఫ్ఐ-ప్రజానాట్యమండలి గ్రామ కార్యదర్శులు నీరటి సంపత్,లింగనబోయిన శ్రీకాంత్,కాసాని రమేష్,సీనియర్ క్రీడాకారుడు దార్నం శ్రీదర్,వంగపండ్ల సోమయ్య,నెలమంచ రాంరెడ్డి,రామగోని సతీష్,పోలాస్ కిష్టయ్య,దాసరి కొమురయ్య,గోడిశాల యాదగిరి,సట్ల రాజు,దైద కుమార్,మేదరవైన కరుణాకర్,పోలసు పద్మాకర్,మంద మొగిలి,అన్నేపు రాజు,మంద రాజు,పిట్టల నగేష్,అన్నేపు అనిల్ రాజు,నిమ్మల రాజు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.