వృద్ధులకు పండ్లు చీరలు పంపిణీ చేసిన టీడీపీ నేతలు
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని
వేంసూరు మండల కేంద్రంలో గల వృద్ధుల శరణాలయంలో వృద్ధులతో బుదవారం సంక్రాంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ నేతలు జరుపుకున్నారు.మండల కార్యదర్శి సంబారు సత్యనారాయణ వృద్ధులకు చీరలు,పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో:జిల్లా నాయకులు బొంతు భాస్కరరావు,మండల అధ్యక్షుడు భీమిరెడ్డి మురళీ కృష్ణారెడ్డి,మహిళా కార్యదర్శి బొంతు విజయలక్ష్మి, నాయకులు బిట్ర మధుసూదన్ రావు,షేక్ బోలా తదితరులు పాల్గొన్నారు.