మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయం కాయం
గల్లీగల్లీలో ఏమ్మెల్యే పాదయాత్ర
కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం
15వార్డులకు గాను 15 వార్డులు మన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి
ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ ప్రచార జోరు
మహబూబాబాద్ జిల్లా మరిపెడలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార పర్వం హోరెత్తుతోంది. ఈ ప్రచారంలో భాగంగా వారు మాట్లాడుతూ పార్టీ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం నిర్వహించారు 15 వార్డులకు గాను 15 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ గల్లీ గల్లీ తిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు.ఎమ్మెల్యే, పార్టీ కార్యకర్తలు,మహిళలు పెద్ద ఎత్తున తరలిరావడంతో మరిపెడ మున్సిపాలిటీ వీధులు కాంగ్రెస్ జెండాలతో నిండిపో యాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు శ్రీరామరక్ష అని ఈ సందర్భంగా పేర్కొన్నారు దాగ్ బంగ్లా సెంటర్లో జరిగిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం నడుస్తోంది.మున్సిపాలిటీల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా చూస్తాం.పారదర్శక పాలన కావాలంటే చేతి గుర్తుకు ఓటు వేయాలి అని పిలుపునిచ్చారు. మరిపెడ మున్సిపాలిటీ రూపురేఖలు మారుస్తామని హామీ ఇచ్చారు.పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనకు తాము నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పా రు. ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ సమస్యలపై పోరాడే కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.మహిళలు,యువత సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తోందని, ప్రజలంతా ఏకతాటిపై నిలిచి కాంగ్రెస్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు,కౌన్సిలర్ అభ్యర్థులు,సీనియర్ నేతలు, వేలాదిమంది కార్యకర్తలు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు వంటి కొమ్ము యుగంధర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి,పట్టణ అధ్యక్షులు షేక్ తాజుద్దీన్,కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెదబోయిన ఐలమళ్ళు,యువ నాయకులు నూకల అభినవ్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు రవి నాయక్, కాలం రవీందర్ రెడ్డి,వీసారపు ప్రగతిశీపాల్ రెడ్డి,గుండగాని వెంకన్న,నల్లు శ్రీకాంత్ రెడ్డి,కుడితి నరసింహారెడ్డి, అబ్జల్,గంధసిరి అంబరీష, గంధసిరి బిక్షపతి గౌడ్, గంగయ్య, సురేష్ నాయక్, మరిపెడ మున్సిపాలిటీ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.