ఫిబ్రవరి 12 న జరిగే సార్వత్రిక సమ్మెకు సిపిఎం సంపూర్ణ మద్దతు
ఫిబ్రవరి 12న తేదీన జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు సిపిఐ ఎం సంపూర్ణంగా మద్దతు తెలుపు తుందని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. సిపిఎం పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, నాయకులు, కార్యకర్తలు అందరూ సమ్మె విజయవంతం కావటానికి క్రియాశీలకంగా సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమ్మెలో దేశం లోని 25 కోట్ల మందికి పైగా సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు, ఉద్యోగులు పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. రైతులు, కూలీలు చిరు వ్యాపారులు, సమస్త శ్రామిక లోకం మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
ఈ సమ్మె కార్మికుల జీతభత్యాల కోసం కాదని, దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం అన్నారు. కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ ప్రయోజిత, మతోన్మాద బీజేపీ ప్రభుత్వం సకల సంపదలను కార్పొరేట్లకు దోచి పెడుతుంది. అమెరికా, ఐరోపా సామ్రాజ్యవాదులకు,దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతుందని, మరోవైపున 4 లేబర్ కోడ్ లను పేరుతో 100 సంవత్సరాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కు లను రద్దు చేసింది.కార్మికుల గొంతు నొక్కి, వాళ్ళ చేతులకు సంకెళ్లు వేసి పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా మారుస్తుంది. ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి 25 కోట్ల మంది పేదల పొట్ట కొట్టింది. విద్యుత్ చట్టాన్ని సవరించి రైతులు, పేదల జీవితాలను ఆగం చేసింది. ఎల్ఐసిని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు దోచిపెడుతుంది. అమెరికాకు లొంగిపోయి, ట్రంప్ కు భయపడి, మన వ్యవసాయ రంగానికి ఉరితాడు పేనుతుంది. దేశానికి ద్రోహం చేస్తున్న
మోడీ ప్రభుత్వంపై సమ్మెతో సమ్మెట దెబ్బ వేయాలని నున్నా పిలుగునిచ్చారు.