పల్లెల్లో ముమ్మర సమ్మె ప్రచారం:సీఐటీయూ
సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల పల్లెల్లో నేడు జరగనున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె గూర్చి
సీఐటీయూ జిల్లా సహయ కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్ బుదవారం మర్లపాడు,వెoకటాపురం,భరణిపాడు,కందుకూరు,దుద్దుపూడి తదితర గ్రామాలలో ముమ్మర ప్రచారం చేశారు.కార్మికులను పని ప్రదేశాల వద్ద కలుసుకొని కరపత్రాలు పంచుతూ సమ్మె విశిష్టత ను వివరించారు.కార్మికులకు సమ్మె చేసే హక్కు,సంఘం పెట్టుకునే హక్కు,వేతనాలు పెంచుకున్నే హక్కు లేకుండా తెచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేయాలని,విత్తన,విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సమ్మె జరుగుతుందని రాజకీయాలకతీతంగా గురువారం జరగనున్న సకలజనుల సమ్మె,నిరసన ప్రదర్శనలో ప్రజలు పాల్గొనాలని మల్లూరు పిలుపునిచ్చారు.బీజేపీ మోదీ ప్రభుత్వ ఒంటెద్దు పోకడకు వ్యతిరేకంగా దేశ రక్షణ కోసం జరుగుతున్న మహత్తర పోరాటమే సమ్మె అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో:ఆరెంపుల హరిబాబు,పరసా అప్పారావు,షేక్ బాజీ,బింగీ వేణు,కిస్ట కొండయ్య,నల్లమోతుల శ్రీను,శివ,చీపి రామకృష్ణ,పూరేటి సుగుణరావు, తుంగా శేషయ్య,మధు,రాజేశ్వరి,మారుతమ్మ,కోలా గోపి,మేకల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.