పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత నందించిన బిషప్ సగిలి ప్రకాష్
ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్ లు ఖమ్మం మెత్రాసన సేవా సంస్థ తరపున బిషప్ సగిలి ప్రకాష్ అందజేశారు. ఖమ్మం డయోసిస్ , ఖమ్మం డయో సిస్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో బాల జ్యోతి రెమెడీల్ స్కూల్ . ఖమ్మం రూరల్ మండలం నందు బిషప్ శ్రీశ్రీ సగిలి ప్రకాష్ గారు ఆదివారం 795 మంది ఉన్నత స్థాయి విద్యనభ్యసిస్తున్న ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఉమ్మడి జిల్లా విద్యార్థులకు స్కాలర్షిప్ లు అందజేసారు. ముఖ్యముగా ఎం బి బి ఎస్, బి ఫార్మసీ ,ఎం ,ఫార్మసీ , పాం డీ ,బిఈడి,ఇంజనీరింగ్, ఎంబీఏ, బీఎస్సీ నర్సింగ్, బిఎస్సి అగ్రికల్చరల్, పీజీ డిగ్రీ,, డి ఎం ఎల్ టి, ఎల్ ఎల్ బి , పీహెచ్డీ మరియు స్పెషల్ ఓరియంటల్ కోర్సు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లు అందజేసారు. *ఈ సందర్భంగా మాట్లాడిన బిషప్ సగిలి ప్రకాష్ గారు విద్యార్థులు మంచి క్రమశిక్షణతో ఉన్నత విలువలను నేర్చుకొని సమాజంలో మంచి పౌరులుగా ఎదిగి దేశ, సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు, మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటుగా ఖమ్మం డయోసిస్ సేవా సంస్థ విద్య , వైద్య, సంక్షేమ రంగాలలో విశేషంగా సేవలు అందిస్తూ ఉందని అందులో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలియజేస్తూ, మంచిగా చదువుకొని తాము కూడా మరికొంతమందికి చేయూత నేచ్చేలా విలువలు నేర్చుకోవాలని, తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి భాద్యతతో చదువుకోవాలని పిలుపు నిచ్చారు . ఉదయం 10గంటలకు ప్రార్థన చేసి విద్యార్థులను దీవించారు. తదనం తరం చెక్కులను పంపిణీ చేసారు. విద్యార్థులందరు ఖమ్మం మెత్రాసన సేవా కార్యక్రమాలను అభినందిస్తూ కృతఙ్ఞతగా బిషప్ గారిని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వికార్ జనరల్ తప్పటి, శౌరి ,ఫైనాన్స్ అడ్మినిస్ట్రేషన్ .సూరేపల్లి ఐజాక్, బిషప్ సెక్రెటరీ ఫాదర్ తుడుం. విజయ్, సోషల్ సర్వీస్ డైరెక్టర్, ఫాదర్ దామల్ల .సురేష్. బోర్డింగ్ రెక్టర్ ఫాదర్ ఆరోగ్యం. ఫాదర్ శ్రీకాంత్, పాస్టర్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ కాకుమాను రాజు, ఫాదర్ సంపత్ మరియు నాయుడుపేట లోగల కమ్యూనిటీ సిస్టర్లు సంఘ పెద్దలు ముత్తమాల. ప్రసాద్ ,సాల్మన్ జయరాజు, పిల్లి .ప్రసాద్. జయరాజు , మాటపోతుల బాబురావు, రాజు ,విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినారు.
కృతజ్ఞతగా విద్యార్థిని విద్యార్థు లు బిషప్ డాక్టర్ సగిలి ప్రకాష్ గారిని సన్మానము చేసినారు.