కాంతులు విరజిమ్ముతున్న హైమాస్ట్ విద్యుత్ లైట్లు
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామ బస్టాండ్ వద్ద హైమాస్ట్ లైట్లను స్థానిక సర్పంచ్ పుట్ట.రేణుక కుమారస్వామి ప్రారంభించారు.సుమారు ఐదు సంవత్సరాలుగా బస్టాండ్ ఆవరణలో హైమాస్ట్ లైట్లులేక గ్రామస్థులు ఇబ్బందులు పడ్డారు.ఇటీవల నూతన సర్పంచ్ గా భాద్యతలుచేపట్టిన పుట్ట. రేణుక సమస్యను గుర్తించి గ్రామపంచాయతీ నిధులతో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు.ఈసందర్భంగా బస్టాండ్ లో అలుముకున్న చీకట్లను తొలగించారు.దీనితో బస్టాండ్ పరిసర ప్రాంతం చుట్టూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్ పుట్ట రేణుక కుమారస్వామికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈకార్యక్రమంలో వార్డు సభ్యులు గంటే కృష్ణ,పోలేపల్లి.రాజ్ కుమార్,అమరగొండ ఒగ్గు సాంబరాజు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పింగిలి బాపిరెడ్డి,బాషబోయిన రాజు,గ్రామశాఖ అధ్యక్షుడు దుస్స రాజయ్య,నాయకులు రవీందర్ రెడ్డి,బుద్దె రమేష్,ఖాసీం,గద్దె రాజయ్య,వక్కల.కరుణాకర్, వెంకటనారాయన, ముంజ వెంకటేష్, సుధాకర్,యూత్ సభ్యులు పాల్గొన్నారు.