పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద చేరిన నాయకులు కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులపై అవమానకర వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నాయకులు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని,భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్, సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా, ఉప సర్పంచ్ కొమురమ్మ, పెద్ద పెండ్యాల సర్పంచ్ తోట నాగరాజు, మాజీ సర్పంచ్ పెసరు రమేష్, బొడ్డు ప్రదీప్ కుమార్, రావుల వెంకటరెడ్డి, గంగారపు జాలిగాపు దుర్గయ్య, బొడ్డు లెనిన్, పుట్ట ప్రదీప్, శ్యామ్, నక్క పౌలు, చిలుక విన్ను తదితరులు పాల్గొన్నారు.