సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
పట్టణంలో పారిశుధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మూడవా వార్డు మొత్తం కలియ తిరుగుతూ ఎక్కడ ఎక్కడ ఎం అవసరం ఉన్నాయా అని అరా తీస్తూన్నా మరిపెడ మున్సిపల్ చైర్మన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి,మున్సిపల్ సిబ్బంది కాలువలు శుభ్రపరచడం, చెత్తను తొలగించడం, రోడ్లపై నీరు నిల్వ లేకుండా తాగు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని డ్రైనేజీ వ్యవస్థను సరిచేస్తున్నారు. ప్రజలు కూడా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నారు, అదేవిదంగా వార్డులోని సీఎంరాఫ్ చెక్కులు వచ్చినా లబ్ధిదారులను గుర్తించి వార్డులోనే వారికీ స్వయంగా అందజేశారు, ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు పానుగోతు రాములు,మెరుగు రాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండగాని వెంకన్న,బోర గంగయ్య, ముత్తయ్య, లింగన్న, శీను,రంగన్న, రవి తదితరులు పాల్గొన్నారు