ముప్పారం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు యువకులు మృతి
ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామ శివారులో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.వివరాల ప్రకారం, దేవునూర్ శివారు నుండి కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు యువకులు ముప్పారం సమీపంలో వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని చుట్టుపక్కల రైతులు గుర్తించి వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.సమాచారం అందుకున్న ధర్మసాగర్ సీఐ శ్రీధర్ రావు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.స్థానికుల సమాచారం మేరకు, ప్రమాదంలో గాయపడిన వారు తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామానికి చెందినవారని తెలిసింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.