కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు
- ప్రిల్ నెలను మహనీయుల మాసంగా పాటించండి
- దళిత క్రైస్తవులు ఎస్సి హోదా పై సుప్రీమ్ తీర్పు పున: సమీక్షించాలి
- కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు
- 78 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ప్రజల మధ్య కులమత వైశమ్యాలు కొనసాగడం విచారకరమని, సాటి మనుషులంతా నాతో సమానమనే సమానత్వ భావననను పెంపొదించడానికి ఏప్రిల్ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా పాటిస్తూ కులరహిత సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబ్ బాబు పిలుపునిచ్చారు. బుధవారం ఖమ్మం ఎన్ ఎస్ పి క్యాంపు సుందరయ్య భవన్ లో కెవిపిఎస్ ఆధ్వర్యంలో కులరహిత సాంస్కృతిక ఉత్సవాల సన్నాహక సమావేశం నిర్వహించారు. కెవిపిఎస్ జిల్లాఉపాధ్యక్షులు పాపిట్ల సత్య నారాయణ అధ్యక్షత వహించారు ముఖ్యఅతిథిగా హాజరైన కేవిపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ ఏప్రిల్ 11 జ్యోతిబాపూలే జయంతి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతులను పురస్కరించుకొని ఏప్రిల్ నెల మొత్తాన్ని మహనీయుల మాసంగా పాటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కులవివక్ష అంటరానితనాన్ని రూపుమాపాలని కులరహిత సాంస్కృతిక ఉత్సవాల ద్వారా ప్రజలలో చైతన్యాన్ని తీసుకురావాలని అయన అన్నారు
- తెలంగాణ రాష్ట్రంలో 200 గ్రామాలలో వీడీసీల పేరిట అట్టడుగు తరగతులపై దౌర్జన్యాల కొనసాగుతున్నాయని తక్షణమే ప్రభుత్వం విడిసి లను నిషేదించాలని డిమాండ్ చేశారు
- గత పదేండ్ల కాలంలో 143 కులదురహంకార హత్యలు జరిగాయని దళితులు పేదలపైన రోజురోజుకి దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని చెప్పారు. కులరహిత సాంస్కృతిక ఉత్సవాలలో జానపద కళాకారులు డప్పు కళాకారులు వివిధ సాంస్కృతిక రూపాలు హాజరుకావాలని కోరారు
- కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ గణాంకాల ప్రకారమే దేశవ్యాప్తంగా నెలకు 10000చొప్పున దళితులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్పారు ఈ దౌర్జన్యాలను అరికట్టడంలో బిజెపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు పైగా వాటిని ప్రోత్సహించే విధంగా బిజెపి విధానాలు ఉన్నాయని చెప్పారు. కేంద్ర బిజెపి సర్కార్ వైఫల్యం వల్ల సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు గ్యాస్ కొరత ఏర్పడిందని తద్వారా విద్యార్థులకు భోజనం వడ్డనా ఇబ్బందిగా మారిందన్నారు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంటకాలు కూడా మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయని చెప్పారు గ్యాస్ కొరతకు నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికాతో అంటకాగుతున్న లొంగుబాటు వైఖరి కారణమని చెప్పారు. పుట్టుకతో వచ్చే కులం కులవివక్ష అంటరానితనం కొనసాగుతూ మతం మారారనే పేరుతో దళితులకు ఎస్సి హోదా ఉండదని సుప్రీంకోర్టు తీర్పు రావడం దళితులపై ముప్పేట దాడి చేయడమేనని అన్నారు మతకోణంలో తీర్పులు రావడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అన్నారు రాజ్యాంగంలోని 25 ఆర్టికల్ 15 ఆర్టికల్ ను ఈ తీర్పు అవమానిస్తుందన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం బెంచ్ కి వెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు తీర్పును పునః సమీక్షించాలని అన్నారు కులరహిత సాంస్కృతిక ఉద్యమాలలో కుల వివక్ష అంటరానితనాన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కవులు కళాకారులు మేధావులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సారధి కళాకారులు ఏప్రిల్ మొత్తం కుల వివక్ష అంటరానితనంపై ప్రజల్లో చైతన్యం చేయడానికి ప్రభుత్వమే విస్తృత ప్రచార కార్యక్రమం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు గరికపాటి నరసింహారావు అనే ప్రవచనకర్త పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కోడిగుడ్డు పెట్టడంపై అహంకారపూరిత అవమానకరమైన వ్యాఖ్యానాలు చేశారని తక్షణమే తన వ్యాఖ్యాలను ఉపసంహరించి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాన్ని కించపరుస్తూ మాట్లాడిన ఆయనకు పద్మశ్రీ అవార్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మార్చి 20న మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దళితులను భారీ ద్రోహానికి గురి చేసిందని, గత బడ్జెట్లో 40,000 కోట్ల రూపాయల కేటాయిస్తే ఈ బడ్జెట్లో కేవలం 11784 కోట్లు మాత్రమే కేటాయించి 70% నిధులు భారీ కోత విధించి దళితులకు తీరని ద్రోహం చేశారని విమర్శించారు గత బడ్జెట్లో కేటాయించిన వాటిలో 3200 కోట్ల రూపాయలు దారి మళ్లించారని విమర్శించారు. ప్రభుత్వ కేటాయింపులు విడుదల ఖర్చులకు మధ్యల ఎక్కడ పొంతన ఉండటం లేదని అన్నారు. సీఎం ఆపేక్స్ బాడీ సమావేశం నిర్వహించి మొత్తం బడ్జెట్ కేటాయింపులు విడుదల ఖర్చు పైన శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుప్రధాన కార్యదర్శులు ముత్తమాల ప్రసాద్ నందిపాటి మనోహర్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు ప్రముఖ అంబేద్కర్ వాది గుంతేటి వీరభద్రం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మెరుగు సత్యనారాయణ పొన్నం వెంకటేశ్వరరావు జిల్లా ఉపాధ్యక్షులు ఎర్ర శ్రీనివాసరావు అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లింగాల రవికుమార్ ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి జిల్లా అధ్యక్షురాలు మెరుగు రమణ తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు కొరిపల్లి శ్రీనివాస రావు సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్ నవీన్ రెడ్డి ఎండి బషీర్ దక్కలి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కర్నేకంటి రామారావు కొలుపులు కుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వీర రాఘవులు డివైఎఫ్ఐ రాష్ట్ర జిల్లా కార్యదర్శి మధు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తుడుం ప్రవీణ్ ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నామ లక్ష్మీనారాయణ వేముల సదానంద్ జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ము శ్రీను నకిరేకంటి చిరంజీవి జిల్లా నాయకులు కర్లకుంట నరేష్ ఎస్కే సైదులు వర కుమార్ పోతరాజు జార్జి పగిడిపల్లి వెంకట్రావు ఆరెంపుల