ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండలం కడారి గూడెం. కట్ర్యాల గ్రామంలోని బూత్ నెంబర్ 227;228;229;లో భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆయా బూత్ అధ్యక్షులు పింగిలి రాజేందర్ రెడ్డి. చిక్కొండ రాజు. శక్తి కేంద్రం ఇంచార్జ్ కుమార్ రాజా పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా నాయకులు కుందూరు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత 12 సంవత్సరాల నుంచి భారతదేశాన్ని సుభిక్షంగా సురక్షతంగా పరిపాలిస్తూ ప్రజలకు సబ్కా సాత్. సబ్కా వికాస్. సబ్కా విశ్వాస్. అనే నినాదంతో భారతదేశంలోని అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పథంలోకి నడిపిస్తూ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను నెరవేర్చే విధంగా అంత్యోదయ పథకాన్ని అమలు చేస్తూ చిట్ట చివర ఉన్న వ్యక్తికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేర్చే విధంగా గరీబ్ కళ్యాణ్ యోజన అమలు చేస్తూ దేశ అభివృద్ధి కోసం నిత్యం పాటుపడుతున్నారని ఆయన అన్నారు. పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి ద్వారా రైతులకు ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి కుటుంబ ఆరోగ్యం కోసం మరియు పేద ప్రజల ఆకలి తీర్చడానికి ప్రతి పౌరుడికి గత ఐదు సంవత్సరాల నుంచి ఉచితంగా బియ్యం గోధుమలు అందిస్తూ దేశ ప్రజల అవసరాలను తీరుస్తూ ఎప్పటికప్పుడు కొత్త పథకాలను తీసుకువస్తూ దేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్దాలని ఆశయంతో పనిచేస్తున్నారని కార్యకర్తలు కూడా ఇదే సంకల్పంతో పనిచేసి భారతీయ జనతా పార్టీని వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో గెలిపించుకొని డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చుకునే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు. పింగిలి సంపత్ రెడ్డి. కుందూరు మల్లారెడ్డి. చెంగల చిరంజీవి. సుల్తాన్ రాజు. వంగాల రాజేందర్ రెడ్డి. ఇటికాల ప్రశాంత్. వడ్డే దేవేందర్. మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.