కార్మికులకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ
సత్తుపల్లి మండల పరిధిలోని
కిష్టారo గ్రామంలో వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సింగరేణి యాజమాన్యం కార్మిక సంక్షేమ చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కిష్టారం ప్రాజెక్ట్‌లో కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో: ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏ.ఎల్.ఎస్.వి. సునీల్ వర్మ, మైన్ మేనేజర్ రామకృష్ణ, ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి కిషోర్, ఐఎన్టీయూసీ పిట్ కార్యదర్శి బాలాజీ పాల్గొన్నారు. అధికారులు స్వయంగా కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో కార్మికులు అధిక ఉష్ణోగ్రతల మధ్య కష్టపడి పనిచేస్తున్నారని, వారి ఆరోగ్యం కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్మికులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని సూచించారు.
ఇదిలా ఉండగా కిష్టారం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లో సింగరేణి యాజమాన్యం తరఫున ఇంటర్ ఏరియా ప్రథమ చికిత్స పోటీలు నిర్వహించారు. ఈ పోటీల ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందించే నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.