సీజ్ చేసిన వాహనాలకు 20న బహిరంగ వేలం
BREAKING NEWS
సీజ్ చేసిన వాహనాలకు 20న బహిరంగ వేలం
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట, ప్రొహిబిషన్&ఎక్సైజ్ స్టేషన్ వర్ధన్నపేట పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను ఈ నెల 20 బుధవారం ఉదయం10 గంటలకు బహిరంగ వేలం వేయనున్నారు.జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరంగల్ ఆధ్వర్యంలో ఈ వేలం జరుగుతుందని వర్ధన్నపేట ఎక్సైజ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ స్వరూప తెలిపారు.వేలంలో పాల్గొనేవారు ప్రభుత్వం నిర్ణయించిన ధరలో 50% ముందుగా చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని సూచించారు.