బాధిత కుటుంబాలకు సండ్ర పబాధిత కుటుంబాలకు సండ్ర పరామర్శరామర్శ
మండలంలోని లింగపాలెం గ్రామానికి చెందిన ఉడతనేని వెంకటేశ్వరరావు ఇటీవల వడదెబ్బకు గురై పెరాలిసిస్ స్ట్రోక్ రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందారు. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న వెంకటేశ్వరరావును సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఇటీవల వడదెబ్బకు గురైన లింగపాలెం సర్పంచ్ యర్రా రమేష్‌ను కూడా ఆయన పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అలాగే గ్రామంలో ఇటీవల జరిగిన సింగరేణి బ్లాస్టింగ్ కారణంగా మాచినేని కృష్ణయ్య ఇంటి స్లాబు కూలిపోయిన ఘటనపై స్పందించారు. ఈ ప్రమాదంలో మాచినేని నరేంద్ర కుమార్ కాలికి గాయాలు కావడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దెబ్బతిన్న ఇంటిని పరిశీలించిన ఆయన, సమస్యపై సింగరేణి జీఎంతో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.