ఐఎన్టియుసి ఫెడరేషన్ అధ్యక్షులుగా కెంబసర్తి నాగేశ్వరరావు
ఇండియన్ నేషనల్ ట్రైడ్ యూనియన్ కాంగ్రెస్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా కెంబసర్తి నాగేశ్వరరావు గారిని నియమిస్తూ ఐఎన్టియుసి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బుధ్ధారం మురహరి హైదరాబాద్ లోని ఐఎన్టియుసి ఫెడరేషన్ కార్యాలయంలో నియామక పత్రాని కెంబసర్తి నాగేశ్వరరావు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కెంబసర్తి నాగేశ్వరరావు మాట్లాడుతూ అసంఘిటిత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వర్తించి కార్మికులకు ఒక బ్రహ్మస్త్రంగా అండగా నిలబడి కార్మికులకు కొరకు నిరంతరం కృషి చేస్తాన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బట్టిని సుమన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొహీర్ లింగ రెడ్డి ,తదితరులు పాల్గొన్నారు.