మరిపెడ మండలంలో ఘనంగా పల్స్ పోలియో
96 శాతం లక్ష్యం పూర్తి మరిపెడ మండలం మరియు మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ బృహత్తర కార్యక్రమంలో, మండలంలోని అన్ని గ్రామాలు మరియు మున్సిపల్ వార్డులలో కలిపి మొత్తం 96 శాతం పోలియో చుక్కల పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభం మరిపెడ మున్సిపల్ కేంద్రంలో మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి విశారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి పోలియో చుక్కల పంపిణీని అధికారికంగా ప్రారంభించారు. అదేవిధంగా, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని గ్రామాలలో స్థానిక సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతం చేశారు.
ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పరిశీలన:
ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని తొర్రూర్ డీప్యూటీ డీమ్ &హో డాక్టర్ సుధీర్ రెడ్డి క్షేత్రస్థాయిలో సందర్శించి, పర్యవేక్షించారు. వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమం సాగిన తీరు మరియు సాధించిన ప్రగతిపై ఆయన పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు.కార్యక్రమంలో పాల్గొన్న వైద్య సిబ్బంది:ఈ వైద్య శిబిరాలలో మరిపెడ ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ పూజిత, డాక్టర్ సౌజన్య, డాక్టర్ స్వామి, డాక్టర్ కిరణ్‌లు సేవలందించారు. వీరితో పాటు పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ మంగమ్మ, హెల్త్ సూపర్వైజర్లు ఆచార్యులు, లలిత కుమారి,మాధవి, వెంకన్నలు పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో స్టాఫ్ నర్స్ పద్మ, పల్లె దవాఖానా సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు,అంగన్వాడీ టీచర్లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. లక్ష్యం వంద శాతం పూర్తి కావడానికి మిగిలిన పిల్లల వివరాలను సేకరిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.