విద్యార్థులకు నోట్ బుక్స్ బహూకరించిన రిటైర్డ్ బ్యాంకు మేనేజర్
స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండ గ్రామ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు ఎం ఎన్ స్వామి,రిటైర్డ్ బ్రాంచ్ మేనేజర్,కెనరాబ్యాంక్ ,వరంగల్. ఏడు వేల రూపాయల విలువగల ఎఫ్ ఏ నోట్ బుక్స్ ను ఒక్కొక్క విద్యార్థికి ఏడు చొప్పున బహుకరించారు . వీరు గతంలో పాఠశాల విద్యార్థులందరికీ స్పోర్ట్సు టీ షర్ట్స్ బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎం ఎన్ స్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు తనకు తోచిన సహాయం చేయడం ఆనందంగా ఉందన్నారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొని ఉన్నత స్థానానికి చేరుకున్నానని, ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఉన్నత విలువలు కలిగిన విద్యార్థులను తీర్చిదిద్దుతాయని తెలిపారు. విద్యార్థులందరూ ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు చిత్తశుద్ధితో నేర్చుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెనుమాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ వితరణ చేసిన ఎంఎన్ స్వామికి ధన్యవాదాలు తెలియచేస్తూ విద్యార్థులందరూ ఉన్నత శ్రేణి ఫలితాలు సాధించి వారి కృతజ్ఞతను చాటుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రుద్ర, లింగమూర్తి, రంజిత్, ఎం శ్రీనివాస్, పి డి గిరెడ్డి ప్రమోద్ రెడ్డి,రవీందర్,డి శ్రీనివాస్ , మురళి, అనసూయ, సలావుద్దీన్,కృపమ్మ,సోమేశ్వరి,రవి, సువర్ణ పాల్గొన్నారు.