మినిమం వేజెస్ చైర్మన్ జనక్ ప్రసాద్‌ను కలిసిన ఐఎన్టీయూసీ నాయకులు
మినిమం వేజెస్ చైర్మన్ జనక్ ప్రసాద్‌ను కలిసిన ఐఎన్టీయూసీ నాయకులు”
సత్తుపల్లి,ఆర్ సి,
జూలై 28 (తెలుగుగళం) న్యూస్: కొత్తగూడెం ప్రాంతం నుంచి సత్తుపల్లి ఏరియాలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ కార్మికులకు గతంలో జారీ చేసిన సర్ఫేస్ టు సర్ఫేస్ నోటిఫికేషన్‌ను తక్షణమే అమలు చేయాలని సత్తుపల్లి ఏరియా ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలోని నాయకులు మినిమం వేజెస్ చైర్మన్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్‌ను ఆయన నివాసంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పిట్ సెక్రటరీలు సీతారామరాజు, నగేష్, షణ్ముఖచారి మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా కొత్తగూడెం ప్రాంతం నుంచి సత్తుపల్లి ఏరియాలో పనిచేస్తున్న సీనియర్ కార్మికులకు గతంలో విడుదల చేసిన సర్ఫేస్ టు సర్ఫేస్ నోటిఫికేషన్ ఇప్పటికీ అమలు కాలేదని తెలిపారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి నోటిఫికేషన్ అమలుకు చర్యలు తీసుకోవాలని జనక్ ప్రసాద్‌ను కోరారు.
దీనిపై స్పందించిన జనక్ ప్రసాద్, ఈ అంశాన్ని సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, గతంలో విడుదలైన నోటిఫికేషన్ అమలుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సెక్రటరీ మురళీకృష్ణ, ఐఎన్టీయూసీ నాయకులు ఇక్బాల్, రమేష్ రవి తదితరులు పాల్గొన్నారు.