రాయపర్తి మండల అభివృద్ధికి అందరి సహకారం అవసరం
•ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలి:నరుకుడు వెంకటయ్య
•రాయపర్తి మండల అభివృద్ధికి అందరి సహకారం అవసరం
తెలుగు గళం న్యూస్ రాయపర్తి/జూలై 31
వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం మండల ప్రత్యేక అధికారి శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన,ఎంపీడీఓ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన వర్ధన్నపేట ఏ ఎమ్ సి చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడారు. ఇది మొదటి సర్వసభ్య సమావేశం కావడంతో వివిధ శాఖల అధికారులు వేదికపై ఉన్నారని తెలిపారు. వివిధ గ్రామాల సర్పంచ్లు తమ గ్రామాల్లోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. మిగిలిపోయిన సమస్యలను రెండో సమావేశంలో అధికారులను అడగాలన్నారు.
అధికారుల సూచనలు, సలహాలు తీసుకుని ప్రజల అభీష్టం మేరకు గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పాక్స్ చైర్మన్ రామచంద్రా రెడ్డి, వర్ధన్నపేట వైస్ చైర్మన్ సిరికొండ కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.