
డాక్టర్ గుంటిపిచ్చయ్యకు ఘన సన్మానం
మునగాల మండల పరిధిలోని నరసింహపురం గ్రామంలో తెలంగాణ మాండళిక కవి ప్రజాకవి శ్రీ కాళోజి నారాయణరావు జన్మదినం పురస్కరించుకొని డాక్టర్ గుంటి పిచ్చయ్యకు కాళోజి కళామతల్లి రంగస్థలం పురస్కారం 2023 తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ కళావేదిక నందు మణికంఠ ఆర్ట్ థియేటర్ వారి తృతీయ వార్షికోత్సవం సందర్భంగా అవార్డును ప్రదానోత్సవం చేసిన సందర్భంగా నేడు నరసింహాపురంలో ప్రముఖ సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ. తెలంగాణ యాషను మాండలిక భాషను దేశవ్యాప్తంగా తీసుకెళ్లి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చి. సినీ రంగంలో తెలంగాణ యాసను పెట్టి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చి న గొప్ప ప్రజా కవి శ్రీ కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఇలా. రంగస్థలంలో ఎన్నో పాత్రలు వేసి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న కళాకారుడు శ్రీ గుంటి పిచ్చయ్య ను. సన్మానించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో చెరువుపల్లి నాగేశ్వరరావు అయినాల వాసు. అల్లి వెంకటేశ్వర్లు ( చిన్న ) షేక్ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు