అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్, 8 గ్యారెంటీలను ఇస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సింగపురం ఇందిర
Uncategorizedఈరోజు చిల్పుర్ మండల పరిధిలోని తీగల తండా ,వఛ్య తండా, వెంకటేశ్వర పల్లె లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సింగపురం ఇందిర గ్రామ ప్రజలు మాట్లాడుతూ మాకు సరైన రోడ్డు మార్గాలు గాని తాగునీరు కానీ ఇండ్లు గాని ఇలాంటి లేవు గ్రామపంచాయతీ మారడం వల్ల మా బతుకులు మారలేదని తెలియజేయడం జరిగినది అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సింగపురం ఇందిర మాట్లాడుతూ కెసిఆర్ కొత్తగా జిల్లాలు కొత్త మండలాలు కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి కనీసం ఆ గ్రామాల్లో కావలసిన మౌలిక సదుపాయాలను కూడా కలిగించలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ప్రతి గ్రామానికి కావలసినటువంటి విద్యా వైద్యం మరియు రవాణా సౌకర్యాలు లాంటివి కలిపించ లేనటువంటి దుర్మార్గమైన పాలన ఈ కేసీఆర్ పాలన 10 సంవత్సరాలు మాయమాటలు చెప్పుకుంటూ వచ్చిన డబుల్ బెడ్రూం కట్టిస్తా మొదట మేమే కట్టిస్తామని చెప్పి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కేటీఆర్ గారు ఐదు లక్షలు ఇస్తామని చెప్పి మరుసటి సంవత్సరం ఆర్థిక మంత్రి హరీష్ రావు కేవలం 3లక్షల ఇస్తానని మాయమాటలు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టుకుంటూ సంవత్సరాలు గడిపారే తప్ప ఒక్క ఇల్లైనా కూడా కట్టెలైనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది కావున డబుల్ బెడ్ ఇండ్లు వచ్చిన వాళ్ళందరూ టిఆర్ఎస్ పార్టీకి ఓటేయండి డబుల్ బెడ్రూంలు రానటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి దళిత బంధు వచ్చిన వాళ్ళందరూ టిఆర్ఎస్ పార్టీకి ఓటేయండి దళిత బంధు రానటువంటి వారందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని పిలుపునివ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల అధ్యక్షులు మండల ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు అనుబంద సంఘాల అధ్యక్షులు యువజన నాయకులు గ్రామ శాఖ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు .