ప్రజా వ్యతిరేక పార్టీలు BJP,BRS, కాంగ్రెస్ లను ఓడించండి ప్రజా పక్షపాతి CPM గెలిపించండి | కానక రెడ్డి గెలుపు జనగామ నియోజకవర్గం అభివృద్ధి కి మలుపు.
Jangaonఎరుపు ఎక్కిన జనగామ పట్టణం
-సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ కామ్రేడ్ సుభాషిణి అలీ .
జనగామ నియోజకవర్గం సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి మోకు కనకా రెడ్డి గెలుపు కాంక్షిస్తూ ఈరోజు జనగామ పట్టణంలోని ప్రెస్టన్ గ్రౌండ్ నుండి అర్& బి గెస్ట్ హౌస్ పక్కన గల ధర్మ కొండల్ రెడ్డి గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభకు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు, సిద్దిపేట జిల్లా కార్యదర్శి అముదాల మల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు మాజీ ఎంపీ కామ్రేడ్ సుభాషిణి అలీ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు మరింత తీవ్రమైనాయి. రైతు వ్యతిరేక చట్టాలు బలవంతంగా రుద్దే ప్రయత్నం చేసింది. కార్మిక చట్టాలు రద్దు చేసింది. మోడీ ప్రభుత్వ విధానాల వల్ల ధరలు ఆకాశాన్ని అంటాయి. దేశ చరిత్రలో ఎప్పుడూలేని స్థాయికి మోడీ పాలనలో నిరుద్యోగం, మహిళల మీద దాడులు, కుల దురహంకార దాడులు పెరిగాయి. ఏటా రెండు. కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మాట నిలబెట్టుకోకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టింది. అదానీ, అంబానీలాంటి ఐడా పెట్టుబడిదారుల కోసం దేశ ప్రజల ప్రయోజనాలు పణంగా పెడుతున్నది. కేంద్రం అధికారాలు, వనరులు గుప్పిట్లో పెట్టుకుని వచ్చి నియంతృత్వం అమలుచేస్తున్నది. ప్రశ్నిస్తే దేశద్రోహులని ముద్ర వేస్తున్నారు. అవినీతిని ఎన్నికల బాండ్ల పేరుతో చట్టబద్ధం చేశారు. రాష్ట్రాల అధికారాలు, హక్కులు, వనరులు హరిస్తున్నారు. రాష్ట్ర విభజన సమస్యలు పరిష్కరించలేదు. ఓట్ల కోసం మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చారు. అమలు మాత్రం ఇప్పుడు జరగదని తేల్చారు. చరిత్రను వక్రీకరిస్తున్నారు. ప్రజాస్వామ్యం. లౌకిక విలువలు, సామాజిక న్యాయం వంటి రాజ్యాంగ మౌలిక సూత్రాల మీద దాడి చేస్తున్నారు. సాంస్కృతిక వైవిధ్యాన్నే ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మతాన్ని రాజకీయ ప్రయోజనం కోసం వాడుకుంటున్నారు. అసెంబ్లీ లో, పార్లమెంటు లో కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, దేశం, రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో అధికారం లో ఉన్న బిఅర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం ఇసుమంత కూడా పని చేయకుండా సంక్షేమ పథకాలతో ప్రజలను మోసం చేస్తుందని, చదువు కున్న యువకులకు ఉపాధి అవకాశాలు విఫలం అయ్యాడు అని అన్నారు.ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే నీతిగా నిజాయితీగా ప్రజల కోసం పని చేసే CPM పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మోకు కనకా రెడ్డి గారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజా వ్యతిరేక పార్టీలు BJP BRS కాంగ్రెస్ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి మోకు కనకా రెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉంటూ అనేక పోరాటాలు చేసి సమస్యల పరిష్కారం కోసం క్రృషి చేశానని ఆయన అన్నారు. నన్ను గెలిపిస్తే జనగామ నియోజకవర్గం అభివృద్ధి కి మలుపు తిరుగుతోందని అన్నారు. గతంలో గెలిచిన సిపిఎం ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధి ఉంది తప్ప కొత్తగా ఏమి అభివృద్ధి జరగలేదు. ఈ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఇతర BRS BJP కాంగ్రెస్ పార్టీలు డబ్బు మద్యం ఖర్చు చేయకుండా ఎన్నికల్లో గెలుపు సాధిస్తారా అని సహల్ చేశారు. ఈనెల 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలలో సిపిఎం అభ్యర్థి అయిన నేను నా గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అవినీతి జనగామ నియోజకవర్గం నుండి తిరిగి కొట్టాలని పిలుపునిచ్చారు.ఈ బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్ గారు కూడా ప్రసంగించారు ఈ సభలో సిపిఎం రాష్ట్ర నాయకులు రాష్ట్ర నాయకులు పుప్పాల శ్రీకాంత్, కాసు మాదవి, అర్ ఎల్ మూర్తి, హన్మకొండ జిల్లా కార్యదర్శి బోట్ల చక్రపాణి, జనగామ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఇర్రి అహల్య రాపర్తి రాజు సాంబరాజు యాదగిరి సింగారాపు రమేష్ రాపర్తి సోమయ్య సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాళ్ళబండి శశిధర్ సత్తిరెడ్డి జనగామ పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ఎజెంట్ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, జనగామ, సిద్దిపేట జిల్లాల నాయకులు సుంచు విజేందర్ బోడ నరేందర్ ఉపేందర్ చందు నాయక్ , ఎండి అజారుద్దీన్ షబానా వెంకట్ మహో అలేటి యాదగిరి చోప్పరి రవి కుమార్ శారద సీనియర్ నాయకులు బొట్ల శ్రీనివాస్ ఎండి దస్తగిరి పాము క్రిష్ణ మూర్తి చిల్పురు MPTC వెన్ను కూస కుమార్ రాంసాగర్ సర్పంచ్ తాడురి రవీందర్ వల్లంపట్ల సర్పంచ్ రజిత తదితరులు పాల్గొన్నారు.