మండలం పరిధిలోని వెంకటాపురం గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సింగపురం ఇందిర
గ్రామ ప్రజలు మాట్లాడుతూ   ప్రత్యేక నిధులు కానీ ప్రత్యేకమైనటువంటి పనులు కానీ ఎలాంటి జరగలేదు అన్ని గ్రామాలలో జరిగిన విధంగానే ఉన్నాయే తప్ప వేరే ఏ విధమైన సదుపాయాలు లేవు కొత్తగా ఇల్లు కట్టేయలేదు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు సిసి రోడ్లు ఎస్సీ కాలనీలో లేవు కరెంటు స్తంభాలు వీధి దీపాలు కూడా లేకుండా ఉన్నావ్, రైతులకు సాగునీరుకు పైప్లైన్ వెయ్యాల్సిందిగా   తెలియజేయడం జరిగింది .
అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి సింగపురం ఇందిర  మాట్లాడుతూ ఈరోజు వెంకటాపురం గ్రామ ప్రజలందరికీ గ్రామ నాయకులకుఈ కార్యక్రమం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఒక తెలుగు రేషన్ కార్డు కూడా ఇచ్చిన దాకలా లేవు విద్యార్థులకు పూర్తిస్థాయిలో  స్కాలర్షిప్లు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం .
అటు బిజెపి ప్రభుత్వం కూడా పేదవారిపై నిత్యవసర సరుకులతో మరియు గ్యాస్ బండతో యుద్ధం ప్రకటించినట్టుగా నిత్యవసర ధరలు పెంచుకుంటూ పేదవారి నడ్డి విరుస్తున్నా సర్కారు మోడీ సర్కారు .
ఇక్కడ కెసిఆర్ ప్రభుత్వం ఏమి చేయలేదని మీరు చెప్పడం కాదు ఆ విషయం అందరికి తెలిసిన విషయమే
కావున ఈసారి రాష్ట్రంలో కేసీఆర్ను కేంద్రంలో మోడీని ఇంటికి పంపించి చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరడం జరిగినది
ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులు మండల అధ్యక్షులు మండల ముఖ్య నాయకులు అనుమతి సంఘాల అధ్యక్షులు మహిళా నాయకురాలు గ్రామ శాఖ అధ్యక్షులు గ్రామ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.