భారతదేశ ఆధునిక సామాజిక సంఘ సంస్కర్తలు జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ ల విగ్రహాల ఆవిష్కరణ
Uncategorizedభారతదేశ ఆధునిక సామాజిక సంఘ సంస్కర్తలు, బహుజనుల ఆరాధ్య దైవాలు అయిన జ్యోతిబాపూలే సావిత్రిబాయిపూలే మరియు మొట్టమొదటి ముస్లిం మహిళ ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ ల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా వెలుగోడు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది. యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విగ్రహాల దాత, బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి, ఫాతిమాషేక్ పుస్తక రచయిత నసీర్ అహమ్మద్, ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఖధీరుల్లా,ఇనయతుల్లా రచయిత అజీజ్, మైనార్టీ నాయకులు రజాక్,అన్వర్ హుస్సేన్ మరియు వెలుగోడు సర్పంచ్, యం.పి.టి.సి,జెడ్.పి.టి.సి,విద్యార్థిని ఛైర్మన్ లు పాల్గొన్నారు.అనంతరం ముఖ్య అతిథులు కలసి మహాత్మా జ్యోతిభా పూలే, సావిత్రిబాయి పూలే, ఫాతిమాషేక్ విగ్రహాలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నక్కలమిట్ట శ్రీనివాసులు, నాసిర్ అహమ్మద్ లు మాట్లాడుతూ విద్యార్థులు సావిత్రిబాయిపూలే జ్యోతిబాపూలే ఫాతిమా షేక్ ల అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆలోచన విధానంతో ముందుకు వెళ్లాలని వారు తెలిపారు. చదువుల తల్లి సావిత్రిబాయిపూలే జయంతి రోజును ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఆధునిక భారతదేశంలోనే మొట్ట మొదటి సామాజిక ఉద్యమకారులు మహాత్మా జ్యోతిరావుపూలే సావిత్రిబాయి పూలే ఫాతిమా షేక్ అని, మహిళలను విద్యా వంతులుగా తీర్చిదిద్దేందు కు తన భార్యను ఉపాధ్యాయురాలు గా తీర్చిన ఘనత జ్యోతిభాపూలే గారిదేనని వారు కొనియాడారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిభాపూలే గారిని గురువులుగా ప్రకటించుకొని విద్యకు సంబంధించిన హక్కులు, రిజర్వేషన్లు, మరియు మహిళల హక్కులు అన్నీ కూడా రాజ్యాంగంలో పొందుపరిచారని తెలిపారు. సావిత్రిబాయి పూలే జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, అదే విధంగా సావిత్రిబాయి పూలే జయంతి రోజున జనవరి 3 వ తేదీని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలను వారు డిమాండ్ చేశారు. మహనీయుల త్యాగాలను స్మరించుకుని ఆ స్ఫూర్తితో బహుజనులందరూ ముందుకు వెళ్లాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రములో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందంతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.