24 గంటల కరెంటు ఇచ్చే బి అర్ ఎస్ పార్టీ కావాలా?? - అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మభ్య పెడుతున్న బీజేపీ కాంగ్రెస్స్ పార్టీలు కావాలా?? గ్రేటర్ వరంగల్ 43 వ డివిజన్ లక్ష్మీపురం గ్రామంలో వివిధ పార్టీల నుండి 100 మందికి పైగా బి అర్ ఎస్ పార్టీలో చేరడం జరిగింది..వీరికి బి అర్ ఎస్ పార్టీ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి అరూరి రమేష్ గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా అరూరి రమేష్ గారు మాట్లాడుతూ..... రైతులకు 3 గంటల కరెంట్ చాలన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా? లేక 24 గంటల కరెంట్ ఇస్తున్న సీఎం కేసీఆర్కు మద్దతు తెలుపుదామో రైతులు ఆలోచించాలని కోరారు. వారెంటు లేని కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రైతు బంధు,రైతు బీమా,కల్యాణ లక్ష్మి,కేసీఆర్ కిట్ వంటి అనేక రకాల సంక్షేమ పథకాలను వర్దన్నపేట నియోజకవర్గంలో పార్టీలకతీతంగా అందించినట్లు వివరించారు. ఎన్నికల తర్వాత తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, కేసీఆర్ బీమా, 400కే గ్యాస్ సిలిండర్ అందించడంతో పాటు గృహలక్ష్మి, బీసీ బంధు, దళిత బంధును అర్హులైన వారికి దశల వారీగా అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 30న జరిగే పోలింగ్ లో కారు గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఉదయ్ కిరణ్, కార్పొరేటర్ అరుణ - విక్టర్,డివిజన్ అద్యక్షులు స్పoదన్, పాక్స్ డైరక్టర్ షణ్ముఖ రెడ్డి,గ్రామశాఖ అద్యక్షుడు, గౌస్ మహిళ అధ్యక్షురాలు అర్చన,షకీల్,డివిజన్ నాయకులు జోజి రెడ్డి, కుమారస్వామి,క్రాంతి,శివ,బాబు, శేఖర్,రాకేష్ తదితరులు పాల్గొన్నారు...