Revanth Reddy biography in Telugu
Uncategorizedప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన జీవిత చరిత్ర
బాల్యం : రేవంత్ రెడ్డి 8 నవంబర్ 1969 వ సంవత్సరంలో మహబూబ్ నగర్ జిల్లాలోని కొండా రెడ్డి పల్లి అనే గ్రామంలో జన్మించారు . రేవంత్ రెడ్డి ఏవి కాలేజ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు .
రాజకీయ రంగప్రవేశం : కాలేజ్ స్టాయి నుండే రేవంత్ రెడ్డి అఖిల భారత విద్యార్థి సభ్యుడిగా ఉన్నాడు . 2006 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో మిడ్జిల్ మండలం నుంచి ఇండిపెండెట్ జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు .
2007 వ సంవత్సరంలో ఇండిపెండెట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు . తరువాత ఈయన చంద్రబాబు నాయుడు తో కలిసి తెలుగు దేశం పార్టీ లో చేరారు .
2009 వ సంవత్సరం లో తెలంగాణ ఏర్పడక ముందు ఆంద్రప్రదేశ్ ఎన్నికలలో కోడంగల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి 14,614 వల మెజార్టీ తో గెలిచారు . తెలుగు దేశం పార్టీ నుండి పోటీ చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ శాసన సభ యొక్క ఫ్లోర్ లీడర్ గా ఎన్నుకోబడ్డారు .
2017లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతానని సమాచారంతో ఫ్లోర్ లీడర్ గా తొలగించబడ్డారు .
2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కోడంగల్ లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి తో ఓడిపోయారు . 2018 వ సంవత్సరం లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టి పి సి సి యొక్క ప్రసిడెంట్ గా నియమించబడ్డారు .
2023 వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కోడంగల్ మరియు కామారెడ్డి నియోజకవర్గం నుండి పోటీ చేశారు .
కామారెడ్డి లో బిజెపి అభ్యర్థి గెలువగా కోడంగల్ లో రేవంత్ రెడ్డి 32532 ఓట్ల భారీ మెజార్టీ తో గెలిచారు .
అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ సీట్లు గెలువడం తో రేవంత్ రెడ్డి ని ముఖ్యమంత్రి అభ్యర్థి గా ఎన్నుకుంటారు అనుకున్నారు కొన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ అధిష్టానం రేవంత్ రెడ్డి కే పగ్గాలు ఇచ్చింది .