Hyderabad News in Telugu
పెరియార్ స్పూర్తితో సామాజికోద్యమాలు
కెవిపిఎస్ ఆధ్వర్యంలో పెరియార్ 50వ వర్ధంతిసభలో వక్తలు
దేశంలో వేల ఏండ్లుగా కొనసాగుతున్న అన్ని రకాల ఆధిపత్యాలను అంతం చేయడమే
భారత సామాజిక ఉద్యమ పితామహుడు పెరియార్ ఇవి రామస్వామి నాయకర్ కు అర్పించే ఘనమైన నివాళి అని పలువురు వక్తలు ఉద్ఘాటించారు
ఆదివారం కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద పెరియార్ రామస్వామి నాయకర్ 50వ వర్ధంతి సభ నిర్వహించారు తొలుత పెరియార్ చిత్రపటానికి ఎస్వీకే ట్రస్ట్ కార్యదర్శి ఎస్ వినయకుమార్ టిపిఎస్కే రాష్ట్ర కన్వీనర్ జి రాములు పూలమాలలు వేసి నివాళులర్పించారు కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ స్కైలాబ్ బాబు అధ్యక్షత వహించిన ఈ సభలో పలువురు ప్రజాసంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొని ప్రసంగించారు
వారు మాట్లాడుతూ పెరియార్ స్ఫూర్తి భౌతిక వాద దృక్పథం దక్షిణ భారతదేశమంతటా వ్యాపించిందన్నారు తమిళనాడులో ఆయన ఆనాడే విగ్రహారాధన పైన దేవుడు మూఢనమ్మకాలు బ్రాహ్మణాధిపత్యం పై తిరుగుబాటు బావుట ఎగరవేశాడని కొనియాడారు వేదాలను బ్రాహ్మణిజాన్ని ప్రశ్నించడం ద్వారా ప్రజలు చైతన్యవంతులు కావాలని ప్రతి దానిని పాదార్థికంగా పరిశీలించటం నేర్చుకోవాలన్నారు మానవాతీత శక్తులను అంగీకరించవద్దని బ్రాహ్మణిజం మనుషుల్ని ముక్కలు చేసిందని ప్రతి మనిషి నాస్తికుడుగా శాస్త్రీయ దృక్పథంతో కృషి కొనసాగించాలని చెప్పారు సోవియట్ రష్యాకి వెళ్లి అక్కడి కమ్యూనిజాన్ని తెలుసుకొని వచ్చి ప్రశ్నించడం నేరమైతే ఆ నేరాన్ని పదేపదే చేస్తానని ఆయన చెప్పడంగొప్ప విషయమన్నారు
నేటితరం ప్రశ్నించడం ద్వారా పెరియార్ స్ఫూర్తి పొందాలన్నారు ఒక దేశం మరొక దేశంపై ఒక మతం మరొక మతంపై స్త్రీలపై పురుషులు తక్కువ కులంపై ఎక్కువ కులం చేసే ఆధిపత్యాలు అన్నిటి పైన మానవీయ దృక్పథంతో ఉద్యమించాలన్నారు
నేడు కేంద్రంలో ఉన్న బిజెపి సర్కార్ మూఢవిశ్వాసాలను పెంచి పోషించడం ద్వారా మత చాందస భావాలను రెచ్చగొట్టి
మనుషులను మట్టి బొమ్మల్గా మార్చేటువంటి కుట్ర చేస్తుందన్నారు ప్రజలలో శాస్త్రీయ దృక్పథం లేకుండా ప్రశ్నించే చైతన్యం ఉండదన్నారు ప్రశ్నించే హక్కు కల్పించిన రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి బిజెపి సర్కార్ కుట్రలు కుతంత్రాలు చేస్తుందన్నారు రాజ్యాంగాన్ని రక్షించుకోవడం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడం ద్వారా పెరియార్ లక్ష్యాలు ఆశయాలను నేటితరం ముందుకు తీసుకెళ్లాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్ అనగంటి వెంకటేష్ టిపిటిఎల్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఐత విజయ్ సోషల్ మీడియా ఇంచార్జి జగదీష్ టిపిఎస్ కె రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు
టి టెన్ సీఈవో సుందర్ కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్ బాల పీరు
బి సుబ్బారావు బి పవన్ ఎస్వీకే నాయకులు ఎన్ సోమయ్య శంకర్ కృష్ణ ప్రసాద్ జగదీష్ వెంకన్న గౌరీతదితరులు పాల్గొన్నారు.