ఏబీవీపీ హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ మరియు ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. హాస్టల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా హాస్టల్లో నాణ్యతతో కూడిన భోజనం పెట్టాలని అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ మరియు బీసీ వెల్ఫేర్ హాస్టల్లో వెంటనే పక్క భవనాలు నిర్మించాలని విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలు విడుదల చేయాలని హాస్టల్లో గదులలో శుభ్రం లేక విద్యార్థులు రోగాలు గురవుతున్నారు ఏ హాస్టల్లో చూసిన ఆహారం బాగా లేక విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఈ దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులకు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కన్వీనర్ ఆరేపల్లి సుజిత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాళ్ల పెళ్లి అరుణ్ , కార్యకర్తలు శ్రీనివాస్ హరిచరణ్ పాల్గొన్నారు