సమానత్వ సాధనే సావిత్రిబాయి లక్ష్యంకేవీపీఎస్ సెమినార్ లో శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత
Uncategorizedఅందరికీ ఉచితంగా నాణ్యమైన ఉన్నత విద్యను అందించడమే సావిత్రిబాయికి అర్పించే ఘనమైన నివాళి అని శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత అన్నారు బుధవారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్ హాల్ లో కెవిపిఎస్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 193 వ జయంతి సందర్భంగా సావిత్రిబాయి పూలే జీవితం సామాజిక న్యాయం అనే అంశంపై సెమినార్ నిర్వహించారు కెవిపిఎస్ నగర అధ్యక్షులు ఎం దశరథ్ అధ్యక్షతన జరిగిన సెమినార్ లో ప్రధాన వక్తగా హాజరైన సూరేపల్లి సుజాత మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా చదువు సంపదలను మెజారిటీ ప్రజలకు నిషేధించడం వల్లే నేటికీ దేశం సంపూర్ణ అక్షరాస్యతను సాధించలేదన్నారు నాడు చదివితే నాలుక కోయాలి. వింటే చెవులలో సీసం పోయాలి అనే తప్పుడు మానసిక చట్టాలను ఉల్లంఘించి అనేక ఆటంకాలను అధిగమించి శూద్రులు మహిళలు అస్పృశ్యుల కోసం పాఠశాలలు నిర్మించిన గొప్ప మానవతావాది పూలే దంపతులని కొనియాడారు నాడు మనుస్మృతి మెజారిటీ ప్రజలకు చదువులు నిషేధిస్తే నేటి పాలకులు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను నెలకొల్పి కొనగలిగిన కొందరికే ఉన్నత విద్యను అందిస్తున్నారని విమర్శించారు. చదువు ఉపాధిని నిర్దేశించే విధంగా పాలించే వారికి విజ్ఞత ఉండాలన్నారు. మత విద్వేషాలు ఉద్రిక్తలను రెచ్చగొట్టడం తప్ప మెజారిటీ ప్రజలను అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి లేదన్నారు సావిత్రిబాయి పూలే జీవితం నుంచి నేటితరం ఎంతో నేర్చుకోవాలన్నారు *కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ నేటి కేంద్ర బీజేపీ సర్కార్ సావిత్రిబాయి పూలే ఆశయాలను సమాధి చేస్తుందన్నారు విద్యారంగానికి స్థూల జాతియ ఉత్పత్తిలో 6 శాతం రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని విద్యారంగ నిపుణులు పేర్కొన్నప్పటికీ, కేవలం 2శాతం నిధులు మాత్రమే కేటాయిస్తున్నారని విమర్శించారు విద్యారంగాన్ని కాషాయీకరణ మత చాందస విద్వేష భావాలను రెచ్చగొట్టడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు ఇవి దేశ సమైక్యతకు సమగ్రతలకు నష్టదాయకం అన్నారు రాజ్యాంగ హక్కులైన విద్యా ఉపాధి సంక్షేమ రాజ్యంలోనే ఉండాలని అవి కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లకూడదని బాబాసాహెబ్ అంబేద్కర్ నాడే ఆకాంక్షించారని పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే అవమానాలు ఆటంకాలు ఎదుర్కొని అందించిన విద్యను నేటి తరం గుర్తుంచుకోవాలన్నారు సరస్వతి దేవి పేరిట సావిత్రిబాయి పూలేను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సావిత్రిబాయి పూలే లక్ష్యాలు ఆశయాలు సాధించాలంటే కామన్ స్కూల్ విధానం రావాలని అందరికీ నాణ్యమైన ఉచిత విద్య అందాలని అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సమావేశంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ కేవీపీఎస్ కార్యదర్శి బి సుబ్బారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్ బాలపీరు కోట సతీష్ బి చెన్నయ్య బి పవన్ కొండయ్య వెంకటాద్రి మౌనిక మంజుల తదితరులు పాల్గొన్నారు