అవినీతి నిర్మూలనలో తెలంగాణ ACB ముందంజ

ఈ69న్యూస్ బ్యూరో
ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న అవినీతి,లంచాలు,అక్రమ ఆస్తులను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన Anti-Corruption Bureau (ACB) దాదాపు 75 ఏళ్ల చరిత్ర కలిగిన సంస్థ.భారతదేశంలో తొలిసారిగా 1947లో అప్పటి బాంబే రాష్ట్ర ప్రభుత్వం“Anti-Corruption and Prohibition Intelligence Bureau”పేరుతో దీనిని ప్రారంభించింది.తర్వాత దానినిAnti-Corruption Bureau (ACB)గా విస్తరించారు.దేశంలోని అన్ని రాష్ట్రాలు తమకంటూ ప్రత్యేక ACBలను ఏర్పాటు చేసుకున్నాయి.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్ 2నుంచి ప్రత్యేక ACB వింగ్ ఏర్పాటు చేసి అవినీతి వ్యతిరేక పోరాటాన్ని కొనసాగిస్తోంది.ACB ప్రధాన ఉద్దేశం
ప్రజలు న్యాయబద్ధమైన సేవలు పొందేలా చూడడం,ప్రభుత్వంపై నమ్మకం పెంపొందించడం,అవినీతి రహిత పరిపాలన ఏర్పరచడం
ఈ సంస్థ ధ్యేయం
“ACB పనిచేసే విధానం”
లంచం కోరుతున్నారనే ఫిర్యాదు అందితే,ముందుగా దాని నిజానిజాలను విచారించి“ట్రాప్ కేసు”ఏర్పాటు చేస్తుంది.ఫిర్యాదు దారుడికి రసాయనంతో పూసిన నోట్లు ఇచ్చి,అవినీతి అధికారి లంచం తీసుకునే సమయంలో రంగేలో పట్టుకుంటారు.ఆ తర్వాత FIR నమోదు చేసి కోర్టులో శిక్ష పడేలా చర్యలు తీసుకుంటారు.అలాగే జీతానికి మించి ఉన్న అక్రమ ఆస్తులపై కూడా ACB దర్యాప్తు చేసి కేసులు నమోదు చేస్తుంది.ఫిర్యాదు చేసే మార్గాలు
ప్రజలు ఎటువంటి భయం లేకుండా ACBకి ఫిర్యాదు చేసేందుకు అనేక సదుపాయాలు ఉన్నాయి.టోల్-ఫ్రీ నంబర్:1064,వాట్సాప్ / కాల్ హెల్ప్‌లైన్:94404-46106,జనరల్ నంబర్:040-23251 555,ఇమెయిల్:dg_acb@telangana.gov.in,హెడ్‌క్వార్టర్స్ చిరునామా:Road No.12,MLA Colony,Banjara Hills,Hyderabad–500034
“ప్రజలకు భరోసా”
ఫిర్యాదు దారుడి పేరు,వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయి.ఎటువంటి ప్రతీకారం భయం లేకుండా ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.మొత్తానికి,అవినీతి వ్యతిరేక పోరాటంలో ACB కీలక భూమిక పోషిస్తున్నా, ప్రజల సహకారం లేకుండా విజయం సాధ్యం కాదు.లంచం అడిగినా,ఇచ్చినా అవినీతికే పాల్పడినట్టే.అందువల్ల ప్రతి పౌరుడు ధైర్యంగా ముందుకు వచ్చి ACBకి ఫిర్యాదు చేస్తేనే అవినీతి నిర్మూలన సాధ్యం అవుతుంది.