
స్టేషన్ ఘనపూర్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంపొందించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న “Arrive Alive” రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా ఘనపూర్ సీఐ ప్రత్యేక చర్యలు చేపట్టారు.
జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేసిన సందర్భంగా సీటు బెల్ట్ ధరించి నియమాలు పాటిస్తూ వాహనం నడిపిన డ్రైవర్లను అభినందిస్తూ వారికి రోజా పువ్వులు అందజేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, సీటు బెల్ట్ వాడకం ప్రాణాలను కాపాడగలదని సీఐ పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. కార్యక్రమానికి వాహనదారుల నుంచి మంచి స్పందన లభించింది.