
ఈ69న్యూస్ హైదరాబాద్, మార్చి 17: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శానిటేషన్ మరియు ఇతర పనుల నిర్వహణ కోసం 250 మంది సిబ్బందిని ఔట్సోర్సింగ్ విధానంలో నియమించేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిను మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, నగర మేయర్ గుండు సుధారాణిలు కలిసి హైదరాబాద్ అసెంబ్లీ ప్రాంగణంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు.సంబంధిత ఫైల్ ప్రస్తుతం మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల వద్ద ఉన్నందున, ఈ మార్చి నెలాఖరు నాటికి ఆమోదం ఇవ్వాలని వారు కోరారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, నెలాఖరు నాటికి మంజూరు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.