ఈ69న్యూస్ జనగామ జూలై 17 జాతీయ స్థాయి విద్యా ప్రమాణాల అధ్యయనంలో (NAS--National Achievement Survey) అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దేశవ్యాప్తంగా 50 జిల్లాల్లో జనగాం జిల్లాకు స్థానం లభించింది.ఈ విజయాన్ని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ కు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.తెలుగు రాష్ట్రాల్లో ఈ గౌరవం పొందిన ఏకైక జిల్లా జనగాం కావడం గర్వకారణంగా మారింది.జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల మెరుగైన అభ్యాసానికి కలెక్టర్ చేస్తున్న నిరంతర సమీక్షలు,పర్యవేక్షణలు,ప్రత్యేక కార్యక్రమాలు ఈ ఫలితాలకు కారణమయ్యాయని జిల్లా విద్యాధికారి భోజన్న తెలిపారు.ప్రతిభను వెలికితీసే విద్యా విధానంఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ భాషా మాట్లాడుతూ…ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే మా లక్ష్యం.విద్యార్థులకు అవసరమైన సాధన,ఉపాధ్యాయులకు శిక్షణ,పాఠశాల స్థాయిలో నిరంతర సమీక్షల ద్వారా ఈ ఫలితాలు సాధ్యం అయ్యాయి అని తెలిపారు.ప్రత్యేక కార్యక్రమాలు,శిక్షణలుNAS కోసం జిల్లాలో పలు శిక్షణా కార్యక్రమాలు,మాక్ టెస్టులు,నమూనా ప్రశ్నాపత్రాల తయారీ,ఆన్లైన్ సెషన్లు,తల్లిదండ్రుల సమావేశాలు,విద్యార్థుల దత్తత వంటి చర్యలు చేపట్టారు. ముఖ్యంగా 3వ తరగతి విద్యార్థుల పఠన నైపుణ్యాల అభివృద్ధికి రీడింగ్-రైటింగ్ ఎక్సలెన్స్ ప్రోగ్రాములు నిర్వహించారని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా విద్యా శాఖ,ఉపాధ్యాయులు,అధికారులు కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు.విద్యారంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న ముందడుగు ఇది అంటూ అభిప్రాయపడ్డారు.