తిరుమలగిరి గ్రామ సర్పంచ్ చల్లగురుగుల సుదర్శన్
•గర్భిణీ స్త్రీలు,పిల్లలు పోషకాహార నియమాలు పాటించాలి-తిరుమలగిరి గ్రామ సర్పంచ్ చల్లగురుగుల సుదర్శన్
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి రేగొండ
రేగొండ మండలంలోని తిరుమలగిరి గ్రామంలో పౌష్టికాహార మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సోమవారం మూడు అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చల్లగురుగుల సుదర్శన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు పల్లిపట్టి, బాలామృతం, గుడ్లు, పాలు తదితర పోషకాహారాన్ని పంపిణీ చేశారు. అనంతరం పిల్లలు, గర్భిణీ స్త్రీలకు అందుతున్న పోషకాహారం నాణ్యత, పంపిణీ విధానాలపై సర్పంచ్ ఆరా తీశారు.సుదర్శన్ మాట్లాడుతూ, ఆహారంలో సమతుల్యత, వైవిధ్యం తప్పనిసరిగా ఉండాలన్నారు.ఒకే రకమైన ఆహారాన్ని అధికంగా తీసుకోకుండా, కేలరీలు మితిమీరకుండా ఆహార నియమాలు పాటించాలని సూచించారు. పిల్లలకు రెండేళ్ల వయస్సు వరకు తల్లి పాలు తప్పనిసరిగా ఇవ్వాలని తెలిపారు.నిత్యం ఆకుకూరలు,కూరగాయలు,పండ్లు ఆహారంలో చేర్చుకోవాలని,శుభ్రమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. అలాగే ఎక్కువగా నీళ్లు తాగడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఏఎన్ఎం సదలక్ష్మి, ఆశా వర్కర్లు, వార్డు సభ్యులు జంగేటి మౌనిక, సవిత, గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.