అంబేద్కర్ కు నివాళులర్పించిన ఉపాధ్యాయులు
వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పర్వతగిరి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాఠశాల వదిలిన అనంతరం పర్వతగిరి అంబేద్కర్ సెంటర్ వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జెడ్ పి హెచ్ ఎస్ పర్వతగిరి పాఠశాల ప్రధానోపాధ్యాయులు నవీన్ కుమార్ గారు మాట్లాడుతూ అస్పృశ్యత అంటరానితనాన్ని నిర్మూలించడానికి జీవితాంతం కృషిచేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. దృఢమైన రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మౌనిక, పరుషరాములు, అనిల్, రమేష్ బాబు, ప్రశాంత్, శ్వేత, సరిత ఎమ్మర్సి సీ ఓ జయరాజ్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు