అనారోగ్యంతో ఉన్న కుటుంబాలను పరామర్శించిన కోలేపాక
బిఆర్ఎస్ పార్టీ రేగొండ టౌన్ అధ్యక్షుడు కోలేపాక బిక్షపతి, పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తూ మానవతా సేవకు మరోసారి నిదర్శనంగా నిలిచారు. అనారోగ్యంతో ఉన్న ఇద్దరు కుటుంబ సభ్యులను గురువారం ప్రత్యక్షంగా ఆసుపత్రుల్లో పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
రేగొండ మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పత్తి బుచ్చిరెడ్డి తల్లి అనారోగ్యంతో పరకాల ఉమాదేవి హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా, ఈ విషయం తెలిసిన వెంటనే కోలేపాక బిక్షపతి ఆసుపత్రికి చేరుకుని ఆమె ఆరోగ్య పరిస్థితిని విచారించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పి, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందించేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం విధులలో ఉన్న వైద్యులను కలిసి, ఆమెకు మెరుగైన చికిత్స అందించాలని కోరారు.
తరువాత, రేగొండ మండలానికి చెందిన మంతెన సురేష్ కుమార్తె జ్వరంతో వరంగల్ యం జి ఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటం తెలుసుకున్న బిక్షపతి, అక్కడికి చేరుకుని బాలిక ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ఆదరణగా నిలుస్తూ, ఆర్థికంగా కూడా రూ.3,000 సహాయం అందించారు. బాలికకు వెంటనే మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.
కోలేపాక బిక్షపతి మాట్లాడుతూ, “ప్రజలు కార్యకర్తలు కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి అండగా నిలవడం ప్రతి నాయకుడి బాధ్యత. ప్రజల సమస్యలపై స్పందిస్తూ, అందరికీ అందుబాటులో ఉండటం మా పార్టీ ధ్యేయం” అని అన్నారు.
బిక్షపతి చేసిన ఈ పరామర్శలకు స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,ప్రజలు ప్రశంసలు తెలియజేశారు.