అనుమతి లేకుండ ఇహెచ్ఎస్ కటింగ్ ఎలా చేస్తారు?
సిఎం, డిప్యూటీ సిఎం జోక్యం చేసుకొని కోతలను రద్దు చేయాలి.
-టి యు ఎం హెచ్ ఇ యు డిమాండ్” ఉద్యోగుల ఆరోగ్య పథకం విధి విధానాలు ఖరారు చేయకుండానే,ఉద్యోగుల అనుమతి తీసుకోకుండ గుట్టుచప్పుడుగా మే నెల వేతనంలో ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ కు బేసిక్ నుండి 1.5% డబ్బులను కట్ చేయడాన్ని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది.ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఫసియుద్దీన్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యాద నాయక్ లు మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ ఆదేశిక సూత్రాల ప్రకారం భారత పౌరులందరికీ నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించే బాధ్యత ప్రభుత్వాలది,కానీ దానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల నుండి 1.5% వేతనాన్ని మినహాయించుకుని వైద్య ఆరోగ్య సేవలు అందిస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు,హాస్పిటల్స్ తో ఒప్పందం చేసుకోకుండానే,ప్యాకేజి రేట్లు నిర్ణయించకుండానే, ఈహెచ్ఎస్ చందా 1.5% మినహాయింపు పై జిఒ ఇవ్వకుండ ఆర్థిక శాఖ అత్యుత్సాహంతో ఈహెచ్ఎస్ చందా పేరిట ఉద్యోగుల మే నెల వేతనాల్లో 1.5% కోత విధించటాన్ని ఖండిస్తున్నాము.ఉద్యోగులు,ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఉన్న సందేహాలను నివృత్తి చేయకుండ రాష్ట్ర ప్రభుత్వం గుట్టు చప్పుడుగా మే నెల వేతనంలో కోత పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది,గత నిబంధనల ప్రకారం భార్యా భర్తలు ఇద్దరు ఉద్యోగులు అయితే ఒక్కరే చందా చెల్లించాలని స్పష్టంగా ఉన్నా ఇప్పుడు ఇద్దరి నుండి చందాను మినహాయించడం అత్యంత దుర్మార్గం అని ఇది ప్రభుత్వానికి తగదన్నారు,ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగుల మినహాయింపులు ఎటు దారి మల్లుతున్నాయో అర్థంకాక ఆవేదన చెందుతున్నారని, ఉద్యోగులు,ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 2023 జూలై నుండి రావలసిన పిఆర్సిని ఇవ్వకుండా,పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా,ఐదు డి ఏ లు ఇవ్వకుండా ప్రభుత్వం కల్లి బొల్లి మాటలతో కాలయాపన చేస్తూ మోసం చేస్తుందని ఇది ఈ ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు.ఆర్థిక శాఖ అత్యుత్సాహంగా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆబాసు పాలవుతుందన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక శాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకొని ఈ హెచ్ ఎస్ కోతలను నిలిపివేసి పూర్తి వేతనాన్ని రేపు జమ చేయాలని లేనియెడల ప్రత్యక్ష పోరాటాలు చేయవలసి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Nice